బాబూ రాజేంద్రప్రసాద్.. సినీ పరిశ్రమపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయొద్దు!: తమ్మారెడ్డి భరద్వాజ

  • పదవి ఉంది కదా అని వ్యాఖ్యలు చేయకండి
  • చాలామంది సినిమా వాళ్లు టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు
  • ముందుగా వాళ్లతో ప్రకటనలు ఇప్పించండి 
ప్రత్యేక హోదా కోసం తెలుగు హీరోలు ఎందుకు పోరాడటం లేదని, ఎవరికైనా అవార్డు రాకపోతే రచ్చ రచ్చ చేస్తారని  టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పదవి ఉంది కదా అని చెప్పి టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సినీ పరిశ్రమపై తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు.

ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ, చాలామంది సినిమా వాళ్లు టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని, ముందు వాళ్లతో ప్రకటనలు ఇప్పిస్తే, ఆ తర్వాత మిగతావారు మాట్లాడతారని అన్నారు. ఇటీవల నంది అవార్డులను ఎవరికి బడితే వాళ్లకిచ్చేశారు కదా! ఆ అవార్డులు తీసుకున్నవాళ్లతో ప్రత్యేకహోదా విషయమై ముందు మాట్లాడించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజేంద్రప్రసాద్ తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు కనుకనే తాను ఈవిధంగా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. 
Go Back to Shorts
babu rajendra prasad
tamma reddy

More Telugu News